హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న హెచ్‌సీఏ-బీ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా అపెక్స్ జట్టు ఓపెనర్ గూడురు మురళీ అక్షిత్ (119) సెంచరీతో రాణించాడు.
హైదరాబాద్ యూనియన్‌తో వన్ చాంపియన్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అక్షిత్‌తో పాటు రితేశ్ (84), విఘ్నేష్ (71) రాణించడంతో అపెక్స్ జట్టు.. 88.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 409 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది.