ఒలింపిక్స్‌కు అన్షు, సోనమ్

అల్మటి: భారత యువ రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ అద్భుత ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్స్ చేరి ఈ ఏడాది జరిగే విశ్వక్రీడలకు అర్హత సాధించారు. మహిళల 57 కేజీల విభాగంలో మూడు బౌట్లలో అలవోకగా నెగ్గి 19ఏండ్ల అన్షు తుదిపోరులో అడుగుపెట్టింది. 62కేజీల విభాగం సెమీస్‌లో 0-6తో వెనుకబడిన సమయంలో సోనమ్ ఒక్కసారిగా విజృంభించి సిన్ పింగ్‌పై (తైపీ) తొమ్మిది పాయింట్లు సాధించి టోక్యో టికెట్ పట్టేసింది. అన్షు విశ్వక్రీడలకు అర్హత సాధించడంతో రియో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌కు టోక్యో తలుపులు మూసుకుపోయాయి. ఇదివరకే మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (53 కేజీలు) ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

