Cristiano Ronaldo | లిస్బన్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో మరో రికార్డు చేరింది. తన అద్భుత ఆటతీరుతో ఇప్పటికే లెక్కకుమిక్కిలి రికార్డులు సొంతం చేసుకున్న రొనాల్డో తాజాగా అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక మ్యాచ్‌ల ఘనతను దక్కించుకున్నాడు. యూరోపియన్ క్వాలిఫయర్‌లో భాగంగా శుక్రవారం లిచ్టెన్స్టెన్తో పోరులో పోర్చుగల్ తరఫున రొనాల్డో 197వ మ్యాచ్ ఆడాడు.
దీని ద్వారా కువైట్‌కు చెందిన బాదెర్ అల్ ముతావ(196 మ్యాచ్‌లు) రికార్డును రొనాల్డో అధిగమించాడు. దీనికి తోడు యూరప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన సెర్గియో రామోస్(180) ఫీట్‌ను రొనాల్డో 2021లో అందుకున్నాడు. ఇదిలా ఉంటే పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్(118)తో రొనాల్డో కొనసాగుతున్నాడు.