T10 League : అబూదాబీలో జరుగుతున్న టీ10 లీగ్(T10 League)లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్(Andre Russell) నిప్పులు చెరిగాడు. మూడు బంతుల్లో రెండు కీలక వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దక్కన్ గ్లాడియేటర్స్(Deccan Gladiators)కు ఆడుతున్న రస్సెల్ మూడు బంతుల వ్యవధిలో చెన్నై బ్రేవ్స్(Chennai Braves) ఓపెనర్లు కొబె హెర్ఫ్ట్ (4), జేసన్ రాయ్(15),లను పెవిలియన్ పంపాడు. ఇద్దరూ కూడా ఒకే మాదిరిగా ఆఫ్ సైడ్ బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.
దక్కన్ గ్లాడియేటర్స్, చెన్నై బ్రేవ్స్ మ్యాచ్ హైలైట్స్
మూడో ఓవర్లో రెండో బంతికి కొబోను వెనక్కి పంపిన రస్సెల్.. నాలుగో బాల్‌కు రాయ్‌ను ఔట్ చేసి చెన్నైకి షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్రేవ్స్ 8 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని దక్కన్ గ్లాడియేటర్స్ అవలీలగా ఛేదించింది. ఓపెనర్లు కొహ్లెర్ కాడ్మొరె(44 నాటౌట్), నికోలస్ పూరన్(35 నాటౌట్) దంచికొట్టడంతో 10 వికెట్లతో గెలుపొందింది.