హరారే: ఐర్లాండ్ మహిళా యువ క్రికెటర్ అమీ హంటర్ చరిత్ర సృష్టించింది. సోమవారం 16వ పడిలోకి ప్రవేశించిన హంటర్ అంతర్జాతీయ వన్డేల్లో పిన్న వయసులో సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో హంటర్ అజేయ సెంచరీ(121నాటౌట్)తో విజృంభించింది. తన కెరీర్లో నాలుగో వన్డే ఆడుతున్న ఈ అమ్మాయి 127 బంతుల్లో ఎనిమిది బౌండరీలతో వీరవిహారం చేసింది. దీంతో జింబాబ్వేపై 85 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ పేరిట ఉన్న రికార్డును హంటర్ బ్రేక్ చేసింది. 1999లో ఐర్లాండ్‌పై 16 ఏండ్ల 205 రోజుల వయసులో ఐర్లాండ్‌పై అజేయ సెంచరీ(114) రికార్డు తాజాగా చెరిగిపోయింది. ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యాచ్ అనంతరం హంటర్ అంది. 15 ఏండ్ల వయసులో ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన హంటర్..అనతికాలంలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగింది. ఐర్లాండ్ జట్టులో ఇప్పటి వరకు వన్డేల్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా అమీ నిలిచింది.