MI vs GG : అమేలియా కేర్ ఓవర్లో అష్ గార్డ్నర్(8) ఔటవ్వడంతో గుజరాత్ మరింత కష్టాల్లో పడింది. 49 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్నేహ్ రానా, హేమలత క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇసీ వాంగ్ (isy wong) కీలక వికెట్ తీసింది. హర్లీన్ డయోల్((22)ను ఎల్బీగా ఔట్ చేసింది. దాంతో, 48 రన్స్ వద్ద నాలుగో వికెట్ పడింది.
హర్లీన్, అష్ గార్డ్నర్తో నాలుగో వికెట్కు 14 పరుగులు జోడించింది. అంతకుముందుఆల్రౌండర్ మాథ్యూస్ దెబ్బకు గుజరాత్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్ ఆఖరి బంతికి అనబెల్ సథర్లాండ్ (0 ఎల్బీగా ఔట్ అయింది. రెండో బంతికి ఓపెనర్ సబ్బినేని మేఘన (16)ను మాథ్యూస్ ఔట్ చేసింది.