పాక్ క్రికెట్ బోర్డుకు కౌంటర్ ఇచ్చిన కేంద్ర క్రీడామంత్రి
Anurag Thakur:వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియాలో జరిగే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోమని పీసీబీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్రీడామంత్రి అనురా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియాలో జరిగే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోమని పీసీబీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాక్ క్రికెట్ బోర్డుకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో పాటు అన్ని పెద్ద జట్లు పాల్గొంటాయని క్రీడామంత్రి ఠాకూర్ తెలిపారు. 2023లో ఇండియా వరల్డ్ కప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
భారత్ అతిపెద్ద క్రీడా దేశమని, ఇక్కడ ఎన్నో ప్రపంచ కప్‌లు జరిగాయని, ఇండియాలో వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరుగుతుందని, ప్రపంచంలోని అన్ని పెద్ద జట్లు ఆ టోర్నీలో పాల్గొంటాయని, ఏ క్రీడలోనూ ఇండియాను విస్మరించలేరని, క్రీడలకు ఇండియా ఎంతో చేసిందన్నారు.క్రికెట్‌కు భారత్ మరీ ఎక్కువే చేసిందన్నారు.
వచ్చే ఏడాది వరల్డ్‌కప్ నిర్వహిస్తామని, ఆ టోర్నీని చరిత్రాత్మక రీతిలో నిర్వహిస్తామని, పాక్‌లో సెక్యూర్టీ సమస్యలు ఉన్నాయని, దానిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని, క్రికెట్ మాత్రమే కాదు, ఇండియా ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదని మంత్రి ఠాకూర్ అన్నారు.
మరో వైపు ఇండియా, పాకిస్థాన్ జట్లు ఆదివారం టీ20 వరల్డ్‌కప్‌లో తలపడనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

