ATP Finals | రెండో సీడ్ అల్కరాజ్కు షాక్.. మెద్వెదేవ్ ముందంజ
ATP Finals : ఇటలీలోని టురిన్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్(ATP Finals )లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు భారీ షాక్ తగిలింది. రెండుసార్లు చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) చేతిలో స్పెయిన్...
ATP Finals : ఇటలీలోని టురిన్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్(ATP Finals )లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు భారీ షాక్ తగిలింది. రెండుసార్లు చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) చేతిలో స్పెయిన్ సంచనలం అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేశాడు.
అద్భుతమైన సర్వ్‌లతో విరుచుకుపడిన జ్వెరెవ్ 6-7 (3), 6-3, 6-4 తో అల్కరాజ్పై గెలుపొందాడు. ఏటీపీ ఫైనల్స్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న 20 ఏండ్ల స్పెయిన్ స్టార్‌కు ఓటమి రుచి చూపించాడు. నిరుడు కడుపులో నొప్పి కారణంగా అల్కరాజ్.. గాయం కారణంగా జ్వెరెవ్ ఈ టోర్నీకి దూరమమైన విషయం తెలిసిందే.
That is massive ☄️@AlexZverev | #NittoATPFinals pic.twitter.com/oWYS09ORfm
— ATP Tour (@atptour) November 13, 2023
మరోవైపు డానిల్ మెద్వెదేవ్(Daniil Medvedev) ముందంజ వేశాడు. తన స్నేహితుడైన ఆండ్రే రుబ్లేవ్‌పై అవలీలగా విజయం సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న మెద్వెదేవ్ రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించి 6-4, 6-2తో మ్యాచ్ ముగించాడు. ఆదివారం గ్రూప్ దశలో నంబర్ 1 నొవాక్ జకోవిచ్, జన్నిక్ సిన్నర్ తొలి మ్యాచ్‌లో గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకో వరల్డ్ నంబర్ 1గా ఈ ఏడాదిని ముగించనున్నాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పనున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Road accident | ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
-
Kurumurthy Jatara | అంగరంగ వైభవంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
-
Burgampad | బీఆర్ఎస్ సభలకు ఎగిసిపడుతున్న జనకెరటం.. గ్యాలరీ..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

