IPL 2024 | టార్గెట్ ఐపీఎల్.. వార్మప్ మ్యాచ్‌లతో బిజీ అవుతున్న ఆ ఇద్దరు క్రికెటర్లు
IPL 2024 | ఏడాదిన్నర క్రితం గాయం కారణంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే ఉంటున్న రిషభ్ పంత్.. ఇటీవలే ఫిట్నెస్ సాధించి వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. పంత్‌కు తాజాగా హార్ధిక్ పాండ్యా కూడా జతకలిశాడు. ఈ ఇద్దరూ కలిసి
IPL 2024 | మరో నెల రోజుల్లో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 17వ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి ఈ లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర క్రితం గాయం కారణంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే ఉంటున్న రిషభ్ పంత్.. ఇటీవలే ఫిట్నెస్ సాధించి వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. పంత్‌కు తాజాగా హార్ధిక్ పాండ్యా కూడా జతకలిశాడు. ఈ ఇద్దరూ కలిసి ఆలూరులో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నారని సమాచారం.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో వచ్చిన నివేదిక ప్రకారం.. ఇన్నాళ్లూ బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో వ్యక్తిగత పర్యవేక్షకుల దగ్గర ట్రైన్ అయిన హార్ధిక్ పాండ్యా, ఇటీవలే ఎన్సీఏకు వచ్చాడు. అక్కడ పాండ్యా.. పంత్‌తో కలిసి ఆలూరులోని స్టేడియంలో 20 ఓవర్ల వార్మప్ మ్యాచ్ కూడా ఆడాడు. వార్మప్ మ్యాచ్‌లో పంత్ సిక్సర్ కొడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ గాయాలతో జట్టుకు దూరమైనవాళ్లే. 2022 డిసెంబర్ 30న పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా.. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా హార్ధిక్ పాండ్యా కాలిగాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు చెమటోడ్చుతున్నారు.
Rishabh Pant smashing in the Practice matches. 🔥🇮🇳pic.twitter.com/hLswXpC6xt
— Johns. (@CricCrazyJohns) February 21, 2024
గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని ఇటవలే ఫిట్నెస్ సాధించిన పంత్.. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్-2024 వరకు సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు. ఐపీఎల్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్సీతో పాటు ప్యూర్ బ్యాటర్‌గా సేవలందిస్తాడని తెలుస్తోంది. పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు సారథిగా ఎంపికైనా అతడు బరిలోకి దిగుతాడా..? లేదా..? అన్నది అనుమానమే..
Latest update on Hardik Pandya and Rishabh Pant🚨#IPL2024 pic.twitter.com/wsQ2enu7nU
— Rohan Gangta Bhai (@rohan_gangta) February 21, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

