Yasin Malik | యాసిన్ మాలిక్ అమాయకుడన్న పాక్ స్టార్ క్రికెటర్.. దిమ్మతిరిగే బదులిచ్చిన స్పిన్నర్
భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిత కొందరు పాక్ క్రికెటర్లు కూడా భారత్‌లో జరిగే కొన్ని సంఘటనలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారికి భారత క్రికెటర్లే ఘాటైన సమాధానాలు ఇస్తూండటం కూడా తెలిసిందే.
తాజాగా పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. దాంతో చిర్రెత్తిన భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా.. అఫ్రిదీకి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. కశ్మీర్ వేర్పాటువాద ముఠాల నాయకుడు యాసిన్ మాలిక్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను అమాయకుడని, యాసిన్ మాలిక్‌పై వచ్చిన ఆరోపణలన్నీ కల్పితాలని అఫ్రిదీ కామెంట్లు చేశాడు.
ఈ కేసులో తన తప్పును యాసిన్ మాలిక్ అంగీకరించాడు కూడా. అయినా సరే అఫ్రిదీ మాత్రం యాసిన్ మాలిక్‌పై పెట్టిన కేసు తప్పుడు కేసన్నాడు. దీనికి సమాధానం ఇచ్చిన మిశ్రా.. ‘‘డియర్ అఫ్రిది.. తను తప్పు చేసినట్లు కోర్టులో ఆన్ రికార్డ్‌గా యాసిన్ ఒప్పుకున్నాడు. నీ పుట్టిన రోజులా అన్నీ మిస్లీడింగ్ కాదని తెలుసుకో’’ అంటూ చురకలేశాడు.
అఫ్రిదీ బర్త్‌డే విషయంలో గతంలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు తన బర్త్‌డేను తప్పుగా రాసి అఫ్రిదీ దొరికిపోయాడు. దీనిపై అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. అయితే ఐసీసీ అధికారులే తను పుట్టిన సంవత్సరాన్ని తప్పుగా రాసుకున్నారని ఆ తర్వాత అఫ్రిదీ బుకాయించాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు.
Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z
— Amit Mishra (@MishiAmit) May 25, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

