T20 World Cup 2024 | సెమీస్ బరిలో అఫ్గనిస్థాన్.. ఆస్ట్రేలియా ఆశలు గల్లంతేనా..?
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్యంగా రాణిస్తున్న అఫ్గనిస్థాన్ (Afghanistan) సంచలన విజయంతో సెమీఫైనల్ బరిలో నిలిచింది. ఆదివారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై సూపర్ విక్టరీ కొట్టింది. దాంతో, సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్యంగా రాణిస్తున్న అఫ్గనిస్థాన్ (Afghanistan) సంచలన విజయంతో సెమీఫైనల్ బరిలో నిలిచింది. సూపర్ 8 తొలి పోరులో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న కాబూలీ టీమ్ ఆదివారం మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై సూపర్ విక్టరీ కొట్టింది. దాంతో, గ్రూప్ 1 పాయింట్ల పట్టికలో రషీద్ ఖాన్(Rashid Khan) నేతృత్వంలోని అఫ్గన్ మూడో స్థానంలో నిలిచింది. దాంతో, సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఆసీస్ సెమీస్ చేరాలంటే జూన్ 24 సోమవారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా(Team India)పై కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు అఫ్గనిస్థాన్ తర్వాతి పోరులో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే చాలు సెమీస్‌లో చేరినట్టే. అలాకాకుండా రోహిత్ సేన చేతిలో ఆసీస్ ఓడితే.. కాబూలీ టీమ్‌కు కలిసొస్తుంది. ఒకవేళ మిచెల్ మార్ష్ బృందం ఒక్క రన్ తేడాతో టీమిండియాపై విజయం సాధిస్తే.. తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 36 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్ గెలవాలి. అప్పుడు ఆసీస్ నెట్ రన్‌రేటులో వెనక్కి నెట్టి అఫ్గన్ తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్డుతుంది.
A famous night for Afghanistan🥳#T20WorldCup #AFGvAUS pic.twitter.com/H32KXK4PaG
— ICC (@ICC) June 23, 2024
గుల్బదిన్ జోరు..
సెయింట్ విన్సెట్లో అఫ్గనిస్థాన్ అద్భుతం చేసింది. మెగా టోర్నీలో ఓటమెరుగని ఆస్ట్రేలియాను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. తొలుత ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51)ల మెరుపులతో రషీద్ సేన ఆసీస్‌కు 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Afghanistan bury the demons of 2023 💥
A historic #T20WorldCup victory for Afghanistan 🤩
📝 #AFGvAUS: https://t.co/wXEyJ9HIRY pic.twitter.com/iIuoGTdyf6
— ICC (@ICC) June 23, 2024
అనంతరం గుల్బదిన్ నయీబ్(4/20) విజృంభణతో కంగారు బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్రకెక్కింది. ఎనిమిదో బౌలర్‌గా బంతి అందుకున్న అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(59) సహా కీలక వికెట్లు తీసి అఫ్గనిస్థాన్ సంచలన విజయంలో భాగమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

