ACC U19 Asia Cup: అండర్-19 ఆసియా కప్ బంగ్లాదే.. ఫైనల్లో చిత్తుగా ఓడిన యూఏఈ
ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ - 19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్.. యూఏఈని చిత్తుగా ఓడించింది.
ACC U19 Asia Cup: గత పది రోజులుగా దుబాయ్ వేదికగా సాగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ – 19 ఆసియా కప్‌ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్‌లో బంగ్లాదేశ్.. యూఏఈని చిత్తుగా ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగుల స్కోరు చేయగా ఛేదనలో యూఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు. 24.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఫలితంగా యువ బంగ్లా.. 195 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లి (149 బంతుల్లో 129, 12 ఫోర్లు, 1 సిక్సర్) తో పాటు చౌదురి ఎండి రిజ్వాన్ (60), అరిఫుల్ ఇస్లాం (50)లు రాణించడంతో బంగ్లా భారీ స్కోరు చేసింది. యూఏఈ బౌలర్లలో అయ్మన్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఛేదనలో యూఏఈ అట్టర్ ప్లాప్ అయింది. ఆ జట్టులో ధ్రువ్ పరశర్ (40 బంతుల్లో 25 నాటౌట్, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. అతడి తర్వాత అక్షత్ రాయ్ (11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరుచేశాడు. మిగిలినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మరూఫ్ మృధ, రోహనత్ బోర్సన్లు తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భాగంగా సెమీస్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఓడించగా యూఏఈ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరిన విషయం విదితమే.
CHAMPIONS 🏆
Congratulations for winning the ACC Men’s U19 Asia Cup 2023.#ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/vFoa3YQc3f— Bangladesh Cricket (@BCBtigers) December 17, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

