Asia Cup 2023 | పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్.. బుమ్రా వచ్చేశాడు
Asia Cup 2023 : ఆసియా కప్‌లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు సూపర్ 4 ఫైట్(Super 4 Fight)కు సిద్దమవుతున్నాయి. టోర్నీలో కీలకమైన ఈ హై టెన్షన్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దాంతో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డే(Reserve Day)ను...
Asia Cup 2023 : ఆసియా కప్‌లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు సూపర్ 4 ఫైట్(Super 4 Fight)కు సిద్దమవుతున్నాయి. టోర్నీలో కీలకమైన ఈ హై టెన్షన్ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడనున్నాడు. నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు స్వదేశానికి వచ్చిన యార్కర్ కింగ్ మళ్లీ జట్టుతో కలిశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్ నెట్స్‌లో చెమటోడ్చాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను పాక్‌పై బరిలోకి దిగే అవకాశం ఉంది.
భారత్, పాక్ సూపర్ 4 మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దాంతో, ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) రిజర్వ్ డే(Reserve Day)ను కేటాయించింది. ఒకవేళ సెప్టెంబర్ 10న వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మరుసటి రోజు ఆడిస్తారు.
జస్ప్రీత్ బుమ్రా

సెప్టెంబర్ 2న దాయాదుల తలపడిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌కు ముందు మొదలైన వాన ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. దాంతో, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అందుకని ఈసారి పూర్తి మ్యాచ్ ఆడించేందుకు నిర్వాహకులు రిజర్వ్ డేని కేటాయించారు. అయితే.. మిగతా జట్ల సూపర్ 4 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం గమనార్హం.
ఇండోర్‌లో సాధన చేసిన భారత క్రికెటర్లు

సూపర్ 4 తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించిన పాక్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. దాంతో, ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. పాక్‌తో తొలి మ్యాచ్ వర్షార్ఫణం కావడంతో ఈ సూపర్ 4 గేమ్‌లో భారత్ విజయంపై కన్నేసింది. కొలంబోలో వరుణుడు అడ్డుపడినా ఇండోర్‌లో కసరత్తులు చేశారు.
ఇవి కూడా చదవండి
Labuschange | సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగి అత్యధిక స్కోర్ చేసిన క్రికెటర్‌గా లబుషేన్ రికార్డు
Golden Ticket | సచిన్‌కు గోల్డెన్ టికెట్.. వరల్డ్ కప్‌కు ఆహ్వానించిన జై షా..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

