దుబాయ్ : భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా అభిషేక్ 875 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతుండగా సూపర్ ఫామ్‌తో జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ (871) రెండో స్థానంలో ఉన్నాడు.
టాప్-10లో భారత్ నుంచి హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా 6,7 స్థానాల్లో ఉన్నారు.