RR vs SRH | ప్చ్.. వైభవ్ సెంచరీ వృథా.. రాజస్థాన్‌పై మళ్లీ గెలిచిన సన్‌రైజర్స్..!
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు చూపిస్తోంది. ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలకు కొనసాగింపుగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది.
RR vs SRH : పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు చూపిస్తోంది. ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలకు కొనసాగింపుగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ(103) రికార్డు సెంచరీతో సవాల్ విసిరిన ఆతిథ్య జట్టుపై ఇషాన్ కిషన్(74), అభిషేక్ శర్మ(57) పిడుగల్లే విరుచుకుపడ్డారు. అర్ధ శతకాలతో గెలపు పునాది వేసిన ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటైనా హెన్రిచ్ క్లాసెన్(29), నితీశ్ రెడ్డి(36)లు దూకుడుగా ఆడి సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం కట్టబెట్టారు.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లోనూ ఛేజింగ్ జట్టే గెలుపొందింది. ఏప్రిల్ 13న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి జైపూర్‌లోనూ జయభేరి మోగించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(103) రికార్డు శతకంతో హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది రాజస్థాన్. అయితే.. ఓపెనర్ ట్రావిస్ హెడ్(6) మళ్లీ విఫలమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ ఓవర్లో తొలి బంతికి తప్పించుకున్నా.. ఐదో బంతికి వికెట్ కీపర్ జురెల్ చేతికి చిక్కాడు.
Riding the wave of pure form! 🌊
A smashing 2️⃣4️⃣ ball FIFTY for Abhishek Sharma 👏
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers | @OfficialAbhi04 pic.twitter.com/ucW8LgHNZn
— IndianPremierLeague (@IPL) April 25, 2026
అనంతరం ఇషాన్ కిషన్(74), అభిషేక్ శర్మ(57)లు దూకుడుగా డారు. 55 బంతుల్లో 132 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఫెరీరా విడదీశాడు. బౌండరీ లైన్ వద్ద ఆర్చర్ క్యాచ్‌తో అభిషేక్ వెనుదిరిగాడు. అప్పటికీ సన్‌రైజర్స్ విజయానికి 60 బంతుల్లో 90 రన్స్ కావాలి. ధనాదన్ ఆడుతున్న ఇషాన్ ఔటయ్యాక హెన్రిచ్ క్లాసెన్(29), నితీశ్ రెడ్డి(36)లు గెలుపు బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగి జట్టును గెలుపు దిశగా నడిపారు. అయితే.. విజయానికి 9 పరుగుల అవసరమైన వేళ బ్రిజేష్ ఓవర్లో నితీశ్ ఎల్బీగా, బిష్ణోయ్ క్యాచ్ పట్టగా క్లాసెన్ వెనుదిరిగారు. ఆ తర్వాత సలీల్ అరోరా(7 నాటౌట్), అనికేత్ వర్మ(1 నాటౌట్)లు లాంఛనం పూర్తి చేశారు. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన హైదరాబాద్ నాలుగో విజయంతో టాప్-4లో స్థానాన్ని పదిలం చేసుకుంది.
వైభవ్ రికార్డు సెంచరీ
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(103) సొంత గడ్డపై శతకంతో విరుచుకుపడ్డాడు. తోపు బౌలర్లను ఉతికేస్తున్న ఈ చిచ్చరపిడుగు ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు దడ పుట్టిస్తూ 36 బంతుల్లోనే వంద కొట్టేశాడు. తొలి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్‌తో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డును ఉరికించిన వైభవ్.. ధ్రువ్ జురెల్(51)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా(33) మెరిసినా వరసగా వికెట్లు తీసిన సన్‌రైజర్స్ బౌలర్లు రాజస్థాన్‌ను పరిమితం చేశారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

