AB de Villiers | జనవరిలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్.. ప్రచారకర్తగా డివిలియర్స్
AB de Villiers : మిస్టర్ 360 ప్లేయర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఏబీ డివిలియర్స్(AB de Villiers)కు అరుదైన గౌరవం లభించింది. ఈ మాజీ క్రికెటర్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SAT20)కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ శుక్రవారం ప్రకటించింది..
AB de Villiers : మిస్టర్ 360 ప్లేయర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఏబీ డివిలియర్స్(AB de Villiers)కు అరుదైన గౌరవం లభించింది. ఈ మాజీ క్రికెటర్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్(SAT20)కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ శుక్రవారం ప్రకటించింది. నిరుడు మొదలైన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు డివిలియర్స్ ఎంతగానో కృషి చేస్తున్నాడు. భారతదేశంతో పాటు బ్రిటన్‌లో ఈ లీగ్‌ను పాపులర్ చేయడంలో అతడి పాత్ర ఎంతో ఉంది.
రెండో సీజన్లో సఫారీ లెజెండ్స్.. హెర్షలీ గిబ్స్, అలన్ డొనాల్డ్, డేల్ స్టెయిన్, మార్క్ బౌచర్, రాబిన్ పీటర్సన్‌తో కలిసి డివిలియర్స్ పని చేయనున్నాడు. ‘ఎస్ఏటీ20తో కొనసాగడం గొప్ప గౌరవం. ఈ లీగ్‌ను ప్రారంభించడం దక్షిణాఫ్రికా క్రికెట్ ముందుచూపును తెలియచేస్తుంది. ఈలీగ్‌లో ఆడే యువ క్రికెటర్లకు అద్భుతమైన నైపుణ్యం ఉంది’ అని డివిలియర్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.
ఏబీ డివిలియర్స్

వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన ఎస్ఏటీ20 లీగ్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 34 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. నిరుడు ఈ టోర్నీలో ఎయిడ్ మర్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్(Pretoria Capitals)పై అద్భుత విజయం సాధించింది.
దక్షిణాఫ్రికా గొప్ప బ్యాటర్లలో ఒకడైన డివిలియర్స్ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ లెజెండరీ ఆటగాడు టీ20 లీగ్స్‌లో దుమ్మురేపాడు. డివిలియర్స్.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు. 16వ సీజన్‌కు ముందు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ 39.71 సగటుతో 5,162 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసక బ్యాటర్ మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఇవి కూడా చదవండి
-
Bank Robbery | మణిపూర్‌లో భారీ బ్యాంకు చోరీ.. రూ.18.85 కోట్లు దోచుకెళ్లిన సాయుధ దుండగులు
-
Cyclone Michaung | దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాన్.. డిసెంబర్ 4న తీరం దాటే అవకాశం..!
-
Belly Fat | ఈ ఫుడ్ కాంబినేషన్స్‌తో పొట్టలో కొవ్వు మటుమాయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

