Cyclone Michaung | దూసుకొస్తున్న మిచాంగ్ తుఫాన్.. డిసెంబర్ 4న తీరం దాటే అవకాశం..!
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ వాయుగుండం శనివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి డిసెంబర్ 4న తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నడుమ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. దాంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్నం, రామనాథపురం, చెన్నై ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నై కార్పొరేషన్ ప్రారంభించిన 1913 హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌కు కూడా సమాధానం ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తుఫాను తీరంవైపు దూసుకొస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు కురవనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయక బృందాలను కూడా సిద్ధం చేశారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

