ICC U19 World Cup | భారత జట్టులోకి ఆరాధ్య యాదవ్
ICC U19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే భారత ఆటగాడు వాసు వాట్స్కు గాయం కావడంతో అతని స్థానంలో ఆరాధ్య యాదవ్‌ను జట్టులోకి

ICC U19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే భారత ఆటగాడు వాసు వాట్స్కు గాయం కావడంతో అతని స్థానంలో ఆరాధ్య యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వాసు స్థానంలో ఆరాధ్య యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అంశాన్ని ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించిందని ఐసీసీ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. వాసు వాట్స్ తొడకు గాయం కావడంతో మ్యాచ్ ఆడలేకపోతున్నాడు.
గత ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు యువ భారత్ సమాయత్తమవుతున్నది. వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో యంగ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన యువ భారత్.. పాంచ్ పటాకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలు సాధించిన యంగ్ ఇండియా.. అదే ఊపులో బంగ్లాను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లాలని భావిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

