Shreyas Iyer | మళ్లీ వెన్నునొప్పి.. ఐపీఎల్‌కు అయ్యర్ అనుమానమే..!
Shreyas Iyer : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు బిగ్ షాక్. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 2024 ఎడిషన్‌లో ఆడడం అనుమానమే అనిపిస్తోంది. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్..
Shreyas Iyer : ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు బిగ్ షాక్. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 2024 ఎడిషన్‌లో ఆడడం అనుమానమే అనిపిస్తోంది. విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఫైనల్లో హాఫ్ సెంచరీతో మెరిసిన అయ్యర్.. అ ఆర్వాత వెన్నునొప్పితో బాధ పడ్డాడు. ఈ పరిస్థితుల్లో ఈ స్టార్ బ్యాటర్ ఐదో రోజు ఫీల్డింగ్ చేయకపోవచ్చు.
వెన్నునొప్పి మరీ ఎక్కువైతే అయ్యర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి కానుంది. అదే జరిగితే.. ఐపీఎల్ ఆరంభంలో అయ్యర్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అయ్యర్ ఆడకుంటే కోల్‌కతా కెప్టెన్‌గా నితీశ్ రానా(Nitish Rana)ను నియమించే చాన్స్ ఉంది. నిరుడు రానా సారథ్యంలోని కోల్‌కతా అద్బుత విజయాలతో అదరగొట్టింది. కానీ, ఆ తర్వాత ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనబడింది.
శ్రేయస్ అయ్యర్, నితీశ్ రానా

ఏడాది నుంచి..
అయ్యర్‌ను వెన్నునొప్పి గత ఏడాది నుంచి వేధిస్తోంది. నిరుడు పలు టోర్నీలకు దూరమైన అతడు ఆసియా కప్(Asia Cup 2023)తో పునరామనం చేశాడు. నాలుగో స్థానంలో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత అయ్యర్‌కు మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది. దాంతో, అతడు రంజీ ట్రోఫీలో ఆడకుండా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో చేరాడు. అయితే.. అయ్యర్ ఫిట్‌గానే ఉన్నాడని, రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు అతడు అబద్దం చెప్పాడని బీసీసీఐకి ఎన్సీఏ అధికారులు లెటర్ రాశారు. దాంతో, ఆగ్రహించిన బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేస్తూ అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది.

ఊహించని పరిణామంతో షాక్ తిన్న అతడు రంజీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. సెమీఫైనల్లో సున్నాకే వెనుదిరిగిన అయ్యర్.. ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే ఔట్ అయ్యాడు. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ముషీర్ ఖాన్‌తో కలిసి ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. దురదృష్టవశాత్తూ 5 పరగులు దూరంలో శతకం చేజార్చుకున్నాడు. ఇక ఫామ్‌లోకి వచ్చాడు అనుకున్నంతలోపే వెన్నునొప్పి గాయం తిరబెట్టిందనే వార్తలు కోల్‌కతా అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- Taxi Driver | మద్యం మత్తులో డ్రైవర్.. మార్కెట్లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ.. మహిళ మృతి, 15 మందికి గాయాలు
- Harry Brook | మా కుటుంబంలో విషాదం.. అందుకనే ఐపీఎల్ ఆడొద్దనుకున్నా
- Tik Tok | అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్.. నిషేధ బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

