ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల గొడవ.. 26 మందికి గాయాలు
Football Match | రెండు జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతున్నది. మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దశలో స్టేడియంలో గొడవ మొదలైంది. ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు.
మెక్సికో సిటీ: రెండు జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ (Football Match) జరుగుతున్నది. మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దశలో స్టేడియంలో గొడవ మొదలైంది. ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తన్నుకున్నారు. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను నిలిపివేశారు. గంటసేపు సాగిన లొల్లితో 26 మంది గాయపడిన ఘటన మెక్సికోలో (Mexico) జరిగింది.

శనివారం రాత్రి మెక్సికోలోని క్వెరెటారో స్టేడియంలో క్వెరెటారో, అట్లాజ్ జట్ల మధ్య ఫుట్‌బాల్ జరుగుతున్నది. తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనను చూడటానికి చాలా మంది స్టేడియానికి తరలివచ్చారు. ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతుండగా స్టేడియంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. రెండు జట్ల అభిమానుల మధ్య చిన్న గొడవ తన్నులాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురింపించారు. చేసేదేం లేక నిర్వాకులు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆటగాళ్లను భద్రత నడుమ డ్రెస్సింగ్ రూముల్లోకి తరలించారు. ఈ గొడవలో 26 మంది గాయపడ్డారు. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మిగిలినవారు క్షేమంగానే ఉన్నారని ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని చెప్పారు.

కాగా, ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్టేడియం నిర్వాహకులకు సూచించింది.



Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Atlas
- clash
- fans
- Football Match
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

