Under -19 Asia Cup | ఆసియా కప్‌లో పాకిస్థాన్ పేసర్ సంచలనం.. రెండో బౌలర్‌గా రికార్డు
Under -19 Asia Cup : దుబాయ్‌లో జరుగుతున్న ప్రతిష్థాత్మక అండర్-19 ఆసియా కప్(Under -19 Asia Cup)లో పాకిస్థాన్ యువ పేసర్ మహ్మద్ జీషాన్(Mohammad Zeeshan) విజృంభించాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండే జీషాన్ ఆరు వికెట్లతో నేపాల్(Nepal) నడ్డి....
Under -19 Asia Cup : దుబాయ్‌లో జరుగుతున్న ప్రతిష్థాత్మక అండర్-19 ఆసియా కప్(Under -19 Asia Cup)లో పాకిస్థాన్ యువ పేసర్ మహ్మద్ జీషాన్(Mohammad Zeeshan) విజృంభించాడు. ఆరడుగుల ఎనిమిది ఇంచుల పొడవుండే జీషాన్ ఆరు వికెట్లతో నేపాల్(Nepal) నడ్డి విరిచాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ యువ కెరటం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
తద్వారా వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో పాక్ బౌలర్‌గా జీషాన్ రికార్డు నెలకొల్పాడు. 2018లో షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi) 15 పరుగులకే 6 వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.
అండర్-19 ఆసియా కప్ పాకిస్థాన్ vs నేపాల్
జీషాన్ సూపర్ స్పెల్‌తో పాక్ నేపాల్‌ను 152 పరుగులకే కట్టడి చేసింది. స్వల్ప లక్ష్యాన్ని పాక్ మరో 142 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇప్పటివరకూ ఒకే ఒక లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన జీషాన్.. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. నిరుడు అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపికైన జీషాన్.. స్వదేశంలో జరిగిన అండర్ 19 వన్డే కప్, అండర్ -19 చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు.
ఇవి కూడా చదవండి
- ODI World Cup 2023 | కాసుల వర్షం కురిపించిన వరల్డ్ కప్.. ఏకంగా రూ.22 వేల కోట్ల ఆదాయం
- Nomophobia | హెల్ ఫోన్.. చేతిలో మొబైల్ ఉంటే ఏదైనా చేయొచ్చులే అనుకుని.. ఏదీ చేయలేని, ఏమీ ఆలోచించలేని స్థితిలోకి
- Free Bus Journey | బాబోయ్ ఉచిత బస్సులు.. పథకం అమలుతో కర్ణాటకలో కొత్త సమస్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

