బీహార్‌కు చెందిన 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దాదాపు 37 ఏండ్లుగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాడు.
15 ఏండ్ల 99 రోజుల వయసులోనే వైభవ్ ఈ మైలురాయిని అందుకోగా, సచిన్ టెండూల్కర్ 1989లో తన 16 ఏండ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. భారత టీ20 122వ ఆటగాడిగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నుంచి వైభవ్ బ్లూ క్యాప్ అందుకున్నాడు. కాగా, అతి పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రికార్డు రొమేనియాకు చెందిన మరియన్ గెరాసిమ్ (14 ఏండ్ల16 రోజులు) పేరిట ఉంది.