అవతరించవె తల్లి!
అందాల బతుకమ్మ!
రంగురంగుల పూల
బంగారు బతుకమ్మ!
జనులగాచే తల్లి!
చక్కనౌ బతుకమ్మ!
తంగేడుపూలలో
తారాడు బతుకమ్మ!
గునుగు పువ్వులలోన
కనబడే బతుకమ్మ!
బంతి పూవులలోన
భాసిల్లు బతుకమ్మ!
లేత గుమ్మడి పూల
లేమనే బతుకమ్మ!
బొడ్డెమ్మ రూపాన
బిడ్డవే బతుకమ్మ!
శ్రీచక్ర రూపాన
సిరులిచ్చు బతుకమ్మ!
జనుల హృదయాలలో
నినదించు బతుకమ్మ!
వాడవాడల వెలసి
పూజలందే తల్లి!
రావమ్మ బతుకమ్మ!
రత్నాల బతుకమ్మ!
– డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557