BAD CHARGING HABITS | మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బాగుండాలంటే.. ఈ మూడు చిట్కాలు పాటించండి!
BAD CHARGING HABITS | ఫోన్లకు చార్జింగ్ పెట్టే విషయంలో చాలామందికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన ఫోన్ లైఫ్ టైమ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్లో అత్యంత కీలకమైన పరికరం బ్యాటరీనే. కాబట్టి బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్‌ను కాపాడుకున్నట్లే.
స్మార్ట్‌ఫోన్ (Smart Phone) వినియోగదారుగా మనం ఫోన్‌కు చార్జింగ్ (Phone charging) పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫోన్లో బ్యాటరీ దెబ్బతినే ఆస్కారం ఉంది. ఫోన్ సాధ్యమైనంత ఎక్కువ కాలం పనిచేయాలంటే బ్యాటరీ పాడవకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఫోన్లకు చార్జింగ్ పెట్టే విషయంలో చాలామందికి కొన్ని చెడ్డ అలవాట్లు (Bad charging Habits) ఉంటాయి. ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన ఫోన్ లైఫ్ టైమ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్లో అత్యంత కీలకమైన పరికరం బ్యాటరీనే. కాబట్టి బ్యాటరీని కాపాడుకుంటే ఫోన్‌ను కాపాడుకున్నట్లే. బ్యాటరీని కాపాడుకోవాలంటే చార్జింగ్ పెట్టే విషయంలో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా మూడు చెడు అలవాట్లను మానుకోవాలి. ఆ మూడు చెడు అలవాట్లేందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మూడు చెడు అలవాట్లను మార్చుకుందాం..
1. ఫోన్‌ను ఫోన్ కేసులోనే ఉంచి చార్జింగ్ పెట్టడం
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఇది సర్వసాధారణమైన చెడు అలవాటు. ఎందుకంటే ఇలా ఫోన్‌ను ఫోన్ కేసులోనే ఉంచి చార్జింగ్ పెట్టడం ద్వారా ముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయి. అందులో ఒకటి బ్యాటరీ హీటెక్కడం అయితే, రెండోది చార్జింగ్ కనెక్టర్ తెగిపోవడం. నాసిరకం మెటీరియల్‌తో తయారయ్యే ఫోన్ కేసులవల్ల చార్జింగ్ కేబుల్ రాపిడికి గురై క్రమంగా మొత్తానికే తెగిపోతుంది. కేస్‌లో ఉంచి చార్జింగ్ పెడితే ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కడంవల్ల చార్జింగ్ వేగం తగ్గుతుంది. అంతేగాక బ్యాటరీ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. అందుకే ఫోన్‌కు చార్జింగ్ పెట్టేటప్పుడు కేస్‌ను తొలగించకపోవడం అనే చెడు అలవాటును మానుకోవాలి.
2. రోజూ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించడం
సాధారణంగా మనం స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు దాంతోపాటు వచ్చే చార్జర్లు ఫాస్ట్‌గా చార్జింగ్ అయ్యేవి ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఈ ఫాస్ట్ చార్జర్లను వినియోగించడం కూడా చెడు చార్జింగ్ అలవాటు కిందే వస్తుంది. ఎందుకంటే కొత్త స్మార్ట్‌ఫోన్‌తో 40W లేదా అంతకంటే స్పీడ్ కలిగిన చార్జర్లు వస్తాయి. ప్రతిరోజూ ఈ చార్జర్లనే వినియోగిస్తే ఒత్తిడిపడి ఏడాదిలోపే ఫోన్లో బ్యాటరీ బాగా క్షీణిస్తుంది. అందుకే ఫాస్ట్ చార్జర్లకు బదులుగా బయట దొరికే నాణ్యమైన స్లో చార్జర్లను కొని వినియోగించడం ఉత్తమం. ఎప్పుడైనా వేగంగా చార్జింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఫాస్ట్ చార్జర్లను వినియోగించుకోవచ్చు. కాబట్టి చార్జింగ్ కోసం రోజూ ఫాస్ట్ చార్జర్లను ఉపయోగించడం అనే చెడు అలవాటును మానుకోవాలి.
3. ఫోన్ చార్జింగ్ 5 శాతం కంటే తగ్గేదాకా చూడటం
మీరు మీ స్మార్ట్ ఫోన్లో చార్జింగ్ 5% కంటే తగ్గేదాకా చూస్తున్నట్లయితే అది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఇలా ఫోన్ చార్జింగ్ 5 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడు బ్యాటరీపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాంతో బ్యాటరీ లైఫ్‌టైమ్ గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఫోన్ చార్జింగ్ 10 నుంచి 15% ఉన్నప్పుడే తిరిగి చార్జింగ్ పెట్టుకోండి. ఎప్పుడో ఒకసారి వీలుపడక ఫోన్లో చార్జింగ్ 5 శాతం దిగువకు పడిపోతే పర్వాలేదుగానీ, ప్రతిరోజూ 5 శాతానికి తగ్గేదాకా చూడటం బ్యాటరీకి మంచిది కాదు.
ఇవి కూడా చదవండి..
Lab Grown Meat | ల్యాబ్ మీట్‌పై రెండేండ్లుగా సీసీఎంబీ పరిశోధనలు.. 2025 నాటికి కృత్రిమ మాంసం అందుబాటులోకి !
Fire Boltt : స్టాక్ మార్కెట్ ట్రాకర్‌తో ఫైర్ బోల్ట్ లెగసీ లాంఛ్..ధర ఎంతంటే..!
Logitech layoffs | 300 మంది ఉద్యోగులను తొలగించిన లాజిటెక్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

