Fire Boltt : స్టాక్ మార్కెట్ ట్రాకర్‌తో ఫైర్ బోల్ట్ లెగసీ లాంఛ్..ధర ఎంతంటే..!
ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ (Fire Boltt) లెగసీ పేరుతో నూతన స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. స్లీక్ స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్‌తో ట్రెడిషనల్ రిస్ట్ వాచ్ లుక్‌తో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ (Fire Boltt) లెగసీ పేరుతో నూతన స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేసింది. స్లీక్ స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్‌తో ట్రెడిషనల్ రిస్ట్ వాచ్ లుక్‌తో ఈ స్మార్ట్‌వాచ్ కస్టమర్ల ముందుకొచ్చింది. వైర్లెస్ చార్జింగ్, స్టాక్‌మార్కెట్ ట్రాకర్ వంటి అరుదైన ఫీచర్లతో 1.43 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో లెగసీ ఆకట్టుకోనుంది. లెదర్, స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ ఆప్షన్స్‌లో లభించే ఫైర్ బోల్ట్ లెగసీ బ్లాక్, బ్రౌన్, సిల్వర్, బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
మార్చి 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫైర్‌బోల్ట్.కాంతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభించే ఫైర్ బోల్ట్ లెగసీ ధర రూ. 3999 నుంచి ప్రారంభమవుతుంది. మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇన్నోవేషన్, వినూత్న ఉత్పత్తుల ఒరవడిలో ఫైర్ బోల్ట్ లెగసీ తమ కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఫైర్ బోల్ట్ కో ఫౌండర్స్ ఆయుషి కిషోర్, ఆర్నవ్ కిషోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఫైర్ బోల్ట్ లెగసీ బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెన్స్, ఐపీ68 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్, 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఎగ్జైటింగ్ ఫీచర్స్‌తో ఆకట్టుకోనుంది.
ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ డివైజ్ వారం రోజుల పాటు నిరంతరాయంగా రన్ అవుతుంది. యాప్‌లో తమ ఫేవరెట్ స్టాక్స్‌ను యాడ్ చేసుకుంటే యూజర్లు రియల్ టైమ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ను తమ వాచ్ నుంచి పొందే వెసులుబాటు ఉంది. ఇంకా రియల్ టైం హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.
Read More :
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

