Xiaomi Hyperphone | జియోమీ నుంచి హైపర్‌ఫోన్.. ఏంటి దీని స్పెషాలిటీ? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి?
Xiaomi Hyperphone | అంటే సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. మరి ఆ హైపర్‌ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.
Xiaomi Hyperphone | జియోమీ తాజాగా భారత మార్కెట్లో జియోమీ 11ఐ సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే.. త్వరలో హైపర్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేస్తామని ఈవెంట్లో ప్రకటించింది. దానికి హైపర్ఫోన్గా నామకరణం చేసింది. అంటే సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. మరి ఆ హైపర్‌ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. టెక్ నిపుణుల ప్రకారం.. జియోమీ లాంచ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్ 11టీ ప్రో అంటూ చెబుతున్నారు. ఈ ఫోన్‌ను యూరప్‌లో గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది.

అదే ఫోన్‌ను హైపర్‌ఫోన్ పేరుతో భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్లో 12జీబీ ర్యామ్, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నారు. అలాగే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీ, 120 హెచ్‌జెడ్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే లాంటి ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ హైపర్ఫోన్కు సంబంధించిన టీజర్‌ను కూడా జియోమీ ఈవెంట్లో డిస్ప్లే చేసింది. యూరప్‌లో లాంచ్ చేసిన ఫోన్ 11టీ ప్రో ఫీచర్లనే ఈ హైపర్ఫోన్లోనూ జియోమీ అందివ్వనున్నట్టు తెలుస్తోంది.
Xiaomi Hyperphone | 11టీ ప్రోతో పాటు 11టీ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్న జియోమీ
8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లతో జియోమీ 11టీ మోడల్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 11టీ ప్రో మాత్రం మూడు వేరియంట్లు 8జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ, 12 జీబీ ప్లస్ 256 జీబీతో లాంచ్ కానుంది. 11టీ ప్రో 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర సుమారుగా రూ.54,600 ఉంటుందని తెలుస్తోంది. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ అయితే రూ.58,800, 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ అయితే రూ.63,000గా ఉండనుంది.
6.67 ఇంచ్ 10 బిట్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీ, ట్రిపుల్ కెమెరా, 108 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ జియోమీ హైపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు జియోమీ 11టీ ప్రోలో ఉండనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్… త్వరలో అందుబాటులోకి
లిథియం బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోలార్ జనరేటర్లు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

