Xiaomi | షియోమీ ఇండియాకు షాక్.. మను కుమార్ జైన్ గుడ్ బై!
Xiaomi | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ సోమవారం రాజీనామా చేశారు.
Xiaomi | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ సోమవారం రాజీనామా చేశారు. తొమ్మిదేండ్లుగా షియోమీలో మను కుమార్ జైన్ సేవలందించారు. షియోమీ ఇండియా మనీ లాండరింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిందన్న అభియోగంపై షియోమీ ఇండియాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న నేపథ్యంలో మను కుమార్ జైన్ వైదొలగడం ఆసక్తికర పరిణామం.
`జీవితంలో మార్పు ఒక్కటే స్థిరం. గత తొమ్మిదేండ్లుగా నా పట్ల షియోమీ యాజమాన్యం చూపిన ఆదరాభిమానాలకు అదృష్టవంతుడ్ని. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థ నుంచి వైదొలగడం కష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. `పలు ఉత్తేజకరమైన అవకాశాలు అందుబాటులో ఉండగా, ఒక ప్రయాణం ముగింపు మరో ప్రయాణానికి నాంది. న్యూ అడ్వెంచర్‌కు స్వాగతం పలుకుతున్నా` అని పేర్కొన్నారు.
2014లో భారత్‌లో షియోమీ ఆవిష్కరణలో మను కుమార్ జైన్ కీలకంగా వ్యవహరించారు. భారత్ మార్కెట్లో విస్తరణకు కృషి చేశారు. `తొమ్మిదేండ్ల తర్వాత షియోమీ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు సమర్థవంతమైన బృందాలు ఉన్న ప్రస్తుత తరుణంలో వైదొలగడం సరైందని విశ్వసిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా జియో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా` అని మను కుమార్ జైన్ పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

