పింక్ కలర్లో వాట్సాప్.. నమ్మి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు
పింక్ కలర్లో వాట్సాప్ | ప్రైజ్ మనీ వచ్చింది.. అదిరిపోయే ఆఫర్.. అంటూ చాలా రకాల ఫేక్ వాట్సాప్ మెసేజ్‌లు గతంలో వచ్చిన సంగతి తెలుసు కదా !

వాట్సాప్ కొత్త కలర్లో వచ్చేసింది.. రొటీన్ గ్రీన్ కలర్ కాకుండా ఇప్పుడు పింక్ కలర్లో వాట్సాప్ వాడేయండి.. కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేయండి.. అంటూ ఇప్పుడు వాట్సాప్‌లో ఓ లింక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.. నిజంగానే వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొచ్చేందేమో అని నమ్మి ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. మీ పర్సనల్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీకు ప్రైజ్ మనీ వచ్చింది.. అదిరిపోయే ఆఫర్.. అంటూ చాలా రకాల ఫేక్ వాట్సాప్ మెసేజ్‌లు గతంలో వచ్చిన సంగతి తెలుసు కదా ! ఆ లింక్‌లు క్లిక్ చేసి చాలామంది మోసపోయారు కూడా.. ఇప్పుడు ఇదే తరహాలో పింక్ కలర్లో వాట్సాప్ అంటూ ఓ లింక్ వైరల్ అవుతోంది. ఆ లింక్ కూడా అచ్చం వాట్సాప్ వెబ్సైట్ లింక్ లానే కనిపిస్తోంది. కానీ అది నకిలీ వెబ్సైట్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ పేరు, మొబైల్ నంబర్ సహా పలు వ్యక్తిగత వివరాలు అడుగుతుంది. ఆ సమాచారం మొత్తం నింపి సబ్మిట్ చేశాక ఆ పేజి నుంచి ఎలాంటి సమచారం ఉండదు. కానీ అప్పటికే మొబైల్లోని వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలు మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతోంది. అంతే కాదు ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు తెలియకుండానే ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ, అలాగే అన్ని గ్రూపుల్లోకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి లింక్ వస్తే జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ ఇప్పటికే లింక్‌పై క్లిక్ చేసి ఉంటే.. వెంటనే ఫోన్‌ను రీసెట్ చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ రీసెట్ చేయడంతో పాటు మెయిల్ ఐడీ, సోషల్ మీడియా, బ్యాంకింగ్ అప్లికేషన్లకు సంబంధించిన పాస్వర్డ్లోను మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే ఎప్పుడైనా వాట్సాప్ కొత్త ఫీచర్లు తీసుకొస్తే ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లోనే అప్డేట్ ఇస్తారని, అంతేతప్ప లింక్‌లు పంపించదని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో ఈ ట్రిక్స్ తెలుసా?
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- tech
- technology
- టెక్నాలజీ
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

