కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. చాట్ బాక్స్‌లో మెసేజ్ చేస్తే.. దానికి రియాక్షన్ ఇచ్చే ఆప్షన్‌ను అందుబాటులో ఉంచాయి. మెసేజ్ రియాక్షన్‌గా కొన్ని ఎమోజీలు ఉంటాయి. ఆ మెసేజ్ సారాంశం ఆధారంగా.. ఆ మెసేజ్‌కు రియాక్షన్ ఇవ్వొచ్చు. ఫేస్బుక్ మెసెంజర్లో ఈ ఆప్షన్ ఉంది. తాజాగా వాట్సప్ కూడా మెసేజ్ రియాక్షన్ ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ట్విట్టర్, ఐమెసేజ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా మెసేజ్‌లకు రియాక్ట్ అయ్యే సదుపాయం ఉంది. అలాగే.. వాట్సప్‌లోనూ ఈ ఫీచర్ రానుంది. వాట్సప్ చాట్‌లో మెసేజ్ పంపించాక.. దాని కింద ఎమోజీలు కనిపిస్తాయి. ఈ ఎమోజీలు.. వ్యక్తిగత చాట్‌తో పాటు గ్రూప్ చాట్‌లో కూడా కనిపిస్తాయి. త్వరలోనే ఈ ఫీచర్‌ను బీటా వర్షన్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ వర్షన్లలో వాట్సప్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
మెసేజ్ రియాక్షన్స్‌తో పాటు.. వాట్సప్.. తాజాగా మనీ హైస్ట్ వెబ్ సిరీస్ అభిమానుల కోసం స్టిక్కర్ హైస్ట్ పేరుతో కొన్ని స్టిక్కర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల మనీ హైస్ట్ ఫైనల్ సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వాట్సప్‌ను అప్డేట్ చేసుకొని.. స్టిక్కర్ స్టోర్‌లోకి వెళ్తే.. న్యూ స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్లోడ్ చేసుకొని.. చాట్‌లో ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండు ఓఎస్‌లలో ఈ స్టిక్కర్స్ అందుబాటులో ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Internet Apocalypse : ఇంటర్నెట్ యుగాంతం వచ్చేసినట్టేనా? దూసుకొస్తున్న భారీ సౌర తుఫానే కారణమా?
Dolby Atmos : డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!
Ez4EV : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మొబైల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు