Vivo Y500 4G | 8100mAh భారీ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో లాంచ్!
Vivo Y500 4G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్దమైంది. Vivo Y 500 4G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇ
Vivo Y500 4G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సరికొత్త మోడళ్లను తీసుకురావడానికి సిద్దమైంది. Vivo Y 500 4G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నేపాల్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
వివో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన టీజర్ల ప్రకారం.. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్‌తో కూడిన infinity AMOLED డిస్ప్లే అందించనున్నారు. లఅలాగే 8100mAh సామర్థ్యంతో కూడిన బ్లూవోల్ట్ బ్యాటరీని అమర్చారు. దీనివల్ల దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే యూజర్లకు ఇది మంచి ఎంపికగా మారనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్లో ఏ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తారన్న విషయాన్ని వివో కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇటీవల గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌లో ఈ ఫోన్ కనిపించడంతో పలు కీలక వివరాలు బయటకొచ్చాయి. అందులో Unisoc T7300 చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేయనున్నట్లుగా ఉంది. అలాగే ఈ మొబైల్ 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నట్లు సమాచారం.
ఇప్పటికే వివో వై500 సిరీస్‌లో 5జీ మోడల్ విడుదలైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో విడుదలైన చైనా మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. అక్కడ దీని ప్రారంభ ధరను 1399 చైనీస్ యువాన్లు (సుమారు రూ.17వేల వరకు )గా నిర్ణయించారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, గరిష్ఠంగా 12జీబీ ర్యామ్చ, 512జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.
అలాగే 5జీ మోడల్ 6.77 అంగుళాల AMOLED డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 8200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. అలాగే ధూళి, నీటి తుంపరల నిరోధకతకు ఇది IP68, IP69 సర్టిఫికెట్తో వస్తుంది. కాగా, ఇప్పుడు 4జీ వెర్షన్లో భారీ బ్యాటరీ, నాణ్యమైన డిస్ప్లే, మెరుగైన పనితీరు వంటి అంశాలపై వివో ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

