న్యూఇయర్‌లో వివో ఎక్స్90 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ..ధర ఎంతంటే..!
వివో ఎక్స్90 సిరీస్ జనవరి 31న గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని లేటెస్ట్ లీక్ వెల్లడించింది. ఇటీవల చైనాలో లాంఛ్ అయిన వివో ఎక్స్90 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌లో భాగంగా భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ : వివో ఎక్స్90 సిరీస్ జనవరి 31న గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని లేటెస్ట్ లీక్ వెల్లడించింది. ఇటీవల చైనాలో లాంఛ్ అయిన వివో ఎక్స్90 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌లో భాగంగా భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. వివో ఎక్స్90 సిరీస్‌లో స్టాండర్డ్, ప్రొ, ప్రొ+ వంటి మూడు మోడల్స్ రానున్నాయి. అయితే ఎక్స్90 సిరీస్‌లో భాగంగా ఇతర మార్కెట్లలోనూ అన్ని మోడల్స్‌నూ వివో లాంఛ్ చేస్తుందా అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
వివో ఎక్స్90 సిరీస్ గ్లోబల్ లాంఛ్‌పై కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా అంకిత్ అనే ట్విట్టర్ ఖాతాలో వెలుగుచూసిన పోస్టర్లో 2023 జనవరి 31న వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు లాంఛ్ అవుతాయని పేర్కొన్నారు. చైనాలో వివో ఎక్స్90 సిరీస్ భారత్ కరెన్సీ ప్రకారం రూ. 42400 నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్ ఫీచర్లు కలిగిన వివో ఎక్స్90 ప్రొ+ ఖరీదు అధికంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో హైఎండ్ పెర్ఫామెన్స్ కోసం లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను వాడుతున్నారు. ఈ డివైజ్ 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేతో క్యూహెచ్డీ+ రిజల్యూషన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది ఎల్టీపీఓ 4.0 టెక్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక డాల్బీ విజన్, హెచ్డీఆర్10+తో పాటు డీసీ డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 50డబ్ల్యూ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. వెనుకభాగంలో 50ఎంపీ క్వాడ్ రియర్ కెమెరాను కలిగిఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

