Android 13 | లీకైన ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఫీచర్లు.. వేరే లెవెల్ అంటున్న నెటిజన్లు
Android 13 | ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్ అవడం.. అవి ఆన్లైన్లో హల్చల్ చేస్తుండటంతో నెటిజన్లు

Android 13| ప్రస్తుతం ఆండ్రాయిడ్ వర్షన్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ఫోన్లలో నడుస్తోంది. కొన్ని స్మార్ట్ఫోన్లు ఇంకా ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌కు అప్‌గ్రేడ్ కాకముందే.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దాని ఫీచర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఫీచర్లు లీకయ్యాయి. మే 2022లో గూగుల్.. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్ అవడం.. అవి ఆన్లైన్లో హల్చల్ చేస్తుండటంతో నెటిజన్లు ఆ ఫీచర్లను చూసి వావ్ అంటున్నారు. సరికొత్త ఫీచర్లు వేరే లేవల్లో ఉన్నాయంటున్నారు.

వాటిలో ముఖ్యంగా యాప్ పర్మిషన్స్‌లో నోటిఫికేషన్స్ పర్మిషన్ అనే కొత్త ఫీచర్ రాబోతోంది. దీని వల్ల.. యాప్స్ యూజర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే నోటిఫికేషన్లను పంపించగలుగుతుంది. యూజర్ పర్మిషన్ లేకుండా ఏ యాప్ కూడా నోటిఫికేషన్లను పంపించే వీలు లేదు. ఆండ్రాయిడ్ 12 వర్షన్ వరకు యూజర్ల అనుమతితో సంబంధం లేకుండా యాప్స్ స్మార్ట్‌ఫోన్‌కు నోటిఫికేషన్ పంపించుకోవచ్చు. ఒకవేళ ఏ యాప్ నోటిఫికేషన్స్ అయినా బ్లాక్ చేయాలని యూజర్ అనుకుంటే అప్పుడు నోటిఫికేషన్స్‌ను ఆపేయొచ్చు.
Android 13 | లాంగ్వేజ్ కంట్రోల్ ఇక యూజర్ చేతుల్లోనే
అలాగే.. లాంగ్వేజ్ విషయంలో కూడా ఆండ్రాయిడ్ 13లో పూర్తిగా కంట్రోల్ యూజర్ చేతుల్లోనే ఉండనుంది. ప్రతి యాప్‌కు ప్రత్యేకంగా భాషను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి యాప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో యూజర్ భాషను మార్చుకుంటే.. ఏ యాప్ అయినా సరే.. యూజర్ సెలెక్ట్ చేసుకున్న భాషలోనే కంటెంట్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 13లో రాబోతున్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే.. Bluetooth LE Audio support. ఇది సరికొత్త ఆడియో సపోర్ట్ సిస్టమ్. ఇది బ్యాటరీ పర్ఫార్మెన్స్ను పెంచుతుంది. అలాగే అన్ని రకాల బ్లూటూత్ పరికరాలను సపోర్ట్ చేస్తుంది.

మే 2022లోగా ఆండ్రాయిడ్ 13ను గూగుల్ రిలీజ్ చేయనుంది. ఆండ్రాయిడ్ 13కు ఇంటర్నల్‌గా గూగుల్ dessert Tiramisu అని పెరు పెట్టింది. సెప్టెంబర్ 2022లోపు రిలీజ్ స్టేబుల్ వర్షన్‌ను విడుదల చేసేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది. ఇంతలో ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్ అవడంతో.. ఆ ఫీచర్లకు యూజర్లు టెంప్ట్ అవుతున్నారు. అయితే.. ఇవే కాకుండా ఇంకా అధునాతనమైన ఫీచర్లు ఆండ్రాయిడ్ 13లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అమ్మో.. 2022లో టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు వస్తున్నాయో?
వాట్సప్ యూజర్లు జాగ్రత్త.. ఆ లింక్ క్లిక్ చేశారంటే మీ అకౌంట్లోని డబ్బులు గోవిందా
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

