Twitter Blue Tick | ఆ అకౌంట్స్‌కు 8 డాలర్ల సబ్స్క్రిప్షన్ వర్తించదు.. ట్విట్టర్
Twitter Blue Tick | పాత వెరిఫైడ్ అకౌంట్స్‌కు 8 డాలర్ల బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ వర్తించదని ట్విట్టర్ ప్రకటించింది.
Twitter’s $8 blue tick service may not impact existing verified accounts
Twitter Blue Tick | ట్విట్టర్ నూతన యజమాని ఎలన్‌మస్క్.. ఆ సంస్థ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఇక నుంచి బ్లూ టిక్ వెరిఫికేషన్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని నిర్ణయించారు. కానీ, ఏమైందో తెలియదు గానీ.. ప్రస్తుత బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్స్‌కు ఈ సబ్స్క్రిప్షన్ వర్తించదని అడ్వర్టైజర్లు అడిగిన పలు ప్రశ్నలకు ట్విట్టర్ ఇచ్చిన రిప్లయ్‌లో చెప్పినట్లు ది వెర్జ్‌లో ఓ వార్తా కథనం వచ్చింది. ఇప్పటికే వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న వారు 90 రోజుల్లో 8 డాలర్లు చెల్లించి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలని, లేకపోతే అకౌంట్ రద్దు చేయాలని అసలు ప్లాన్ అని మరో వార్తాకథనం.
లార్జ్ బ్రాండ్ అడ్వర్టైజర్లలో వెరిఫైడ్ అకౌంట్స్ కల వారికి ఈ వారంలో ట్విట్టర్ బ్లూ టిక్ రీ లాంచ్ చేసిన తర్వాత అదనంగా `అఫిషియల్` అనే లేబుల్ పొందుతారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ట్విట్టర్ యాజమాన్యం.. ఎనిమిది డాలర్లకు బ్లూ టిక్ వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నది.
ఈ నెల ఏడో తేదీ నుంచి న్యూ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ రోల్ అవుట్ చేయాలని, లేనిపక్షంలో వారికి ఉద్వాసన తప్పదని ట్విట్టర్ ఉద్యోగులను ఎలన్‌మస్క్ ప్రారంభంలో హెచ్చరించారని సమాచారం. న్యూ ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీస్.. తక్కువ యాడ్స్, సెర్చ్ ప్రియారిటీ, ఎక్కువ నిడివి గల వీడియోలో పోస్టింగ్ సామర్థ్యం, బ్లూ బ్యాడ్జితో వస్తుంది.
ఇప్పుడు ఎవరైనా వెరిఫైడ్ చెక్ మార్క్ పొందిన వారు ప్రతి నెలా ఎనిమిది డాలర్లు చెల్లించాల్సిందే. రియల్ ట్విట్టర్ అకౌంట్స్, స్పామ్ అకౌంట్స్ సంగతి నిగ్గు తేల్చాలన్న లక్ష్యంతోనే ట్విట్టర్ యాజమాన్యం సరికొత్త బ్లూ టిక్ పాలసీ తీసుకొచ్చినట్లు సమాచారం. భారత్‌లో నెల రోజుల్లో 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అందుబాటులోకి వస్తుందని ఎలన్‌మస్క్ స్పష్టం చేశారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

