రష్యాకు బిగ్ షాక్ ఇచ్చిన యాపిల్, గూగుల్, మెటా, టిక్‌టాక్.. ఏం చేశాయంటే?
రష్యాపై ఆంక్షలను విధించాలని.. రష్యాతో ఉన్న సంబంధాలను తెంచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం టాప్ టెక్ కంపెనీలను అర్జించింది.
నేడు ప్రపంచం మొత్తం ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతోంది. రష్యా చేస్తున్న వికృత క్రీడను ఆపాలంటూ ముక్త కంఠంతో వినిపిస్తోంది. ప్రపంచ దేశాలు రష్యా చేస్తున్న పనిని తప్పు అని నిలదీస్తున్నా రష్యా మాత్రం తన ప్రతాపాన్ని ఉక్రెయిన్‌పై చూపిస్తూనే ఉన్నది. ఉక్రెయిన్ను నాశనం చేసేసింది. దీని వల్ల ఉక్రెయిన్ ఎంత నష్టపోతుందో పక్కన పెడితే.. రష్యా మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
దానికి నిదర్శనమే రష్యాకు కటీఫ్ చెప్పిన టాప్ టెక్ కంపెనీలు. గూగుల్, యాపిల్, మెటా, టిక్‌టాక్ లాంటి టాప్ టెక్ కంపెనీలు.. రష్యాకు బిగ్ షాక్ ఇచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలబడ్డాయి.
యాపిల్ సంస్థ.. రష్యాలో యాపిల్ ప్రొడక్ట్స్‌ను అమ్మడమే ఆపేసింది. ఐఫోన్స్‌తో సహా.. యాపిల్‌కు చెందిన ఏ ఒక్క ప్రొడక్ట్‌ను కూడా రష్యాలో అమ్మడం లేదు. అలాగే.. గూగుల్, మెటా సంస్థలు కూడా వాటి ప్లాట్‌ఫామ్స్‌లో రష్యా స్టేట్ మీడియాను బ్యాన్ చేశాయి.
ఏఎండీ, డెల్, టీఎస్ఎంసీ, ఇంటెల్ లాంటి ఇతర కంపెనీలు రష్యాలో తమ ప్రాడక్ట్స్ సేల్స్‌ను ఆపేశాయి. వాటితో పాటు మరో 50 టెక్ కంపెనీలు రష్యాకు కటీఫ్ చెప్పేశాయి. రష్యాపై ఆంక్షలను విధించాలని.. రష్యాతో ఉన్న సంబంధాలను తెంచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం టాప్ టెక్ కంపెనీలను అర్జించింది. దీంతో ఉక్రెయిన్ ప్రభుత్వానికి తమ మద్దతు పలుకుతూ టాప్ కంపెనీలు రష్యాకు గుడ్‌బై చెప్పేశాయి.
గూగుల్ సెర్చ్ టూల్‌తో పాటు యూట్యూబ్‌లో కొన్ని ఫీచర్లను రష్యాకు అందుబాటులో లేకుండా చేసింది గూగుల్. రష్యాకు చెందిన అన్ని అడ్వర్టైజ్మెంట్స్ను గూగుల్ ఆపేసింది. ఇలా రష్యాలో పలు సర్వీస్‌లను గూగుల్ ఆపేసింది.
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా కూడా యాపిల్, గూగుల్ బాటలోనే పయనిస్తోంది. ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్, మానెటైజేషన్‌ను నిలిపివేసింది.
ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టీఎస్ఎంసీ, డెల్, టిక్‌టాక్, స్నాప్, వైబర్, నెట్‌ఫ్లిక్స్, రోకు, స్పోటిఫై, ఒరాకిల్, ఎస్ఏపీ, ఈఏ, సీడీ ప్రాజెక్ట్ రెడ్, పేపాల్, నోకియా, ఎరిక్సన్, సిస్కో, గోడాడీ, డక్‌డక్‌గో లాంటి కంపెనీలు తమ సర్వీసులను రష్యాలో యుద్ధప్రాతిపదికన నిలిపివేశాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఆర్టీ, స్పుత్నిక్ న్యూస్ ఏజెన్సీలను తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- Meta
- Russia Invasion
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

