రెండో రోజూ విజయవంతంగా ప్రళయ్ క్షిపణి పరీక్ష
Pralay Missile: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది. కేవలం 24 గంటల వ్యవధిలో

భువనేశ్వర్: ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది. కేవలం 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఈ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఒక డెవలప్మెంట్ మిస్సైల్‌ను రెండు వరుస రోజుల్లో విజయవంతంగా పరీక్షించడం ఇదే మొదటిసారని వారు చెప్పారు.
కాగా, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సక్సెస్‌ఫుల్‌గా చేధించగలదు. అదేవిధంగా 500 కేజీల నుంచి 1000 కేజీల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. ఈ ప్రళయ్ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూపొందించిన పృథ్వి డిఫెన్స్ వెహికిల్‌ను ఆధారంగా చేసుకుని ఈ ప్రళయ్ క్షిపణిని రూపొందించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

