ఐఫోన్లను భారీగా కొనుగోలు చేస్తున్న భారతీయులు : టిమ్ కుక్
భారతీయులు ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు.
న్యూఢిల్లీ : భారతీయులు ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. కంపెనీ రాబడి వృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరం మూడో క్వార్టర్ ఆర్ధిక ఫలితాలను యాపిల్ వెల్లడించింది. బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాంల్లో రెండంకెల వృద్ధితో పాటు భారత్‌లో కంపెనీ ఆదాయం దాదాపు రెండింతలైందని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ క్వార్టర్లో 83 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది.
ఐఫోన్ల వ్యాప్తి తక్కువగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, భారత్ వంటి దేశాల్లో అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కుక్ తెలిపారు. కంపెనీ రాబడిలో ఐఫోన్ నుంచే అధిక ఆదాయం నమోదైంది. కంపెనీ మొత్తం రాబడిలో ఐఫోన్ సేల్స్ ద్వారా సమకూరిన ఆదాయం 50 శాతం వరకూ ఉండటం గమనార్హం. ఇక ఈ క్వార్టర్లో ఐపాడ్స్, ఎయిర్‌పాడ్స్, వాచ్ విభాగం నుంచి రాబడులు పడిపోయాయి.
ఇక గత క్వార్టర్లో కొవిడ్ నియంత్రణలతో పాటు పలు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్ధ్యం తగ్గడం వంటి అవరోధాలు ఎదురయ్యాయని కుక్ చెప్పారు. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కొరియా, భారత్ సహా పలు దేశాల్లో యాపిల్ సర్వీసులు రికార్డులు నెలకొల్పాయని కంపెనీ సీఎఫ్ఓ లుకా మయస్త్రీ వివరించారు. విప్రో వంటి కంపెనీలు ఉద్యోగులను కాపాడుకునేందుకు, నైపుణ్యాలను ఆకర్షించేందుకు యాపిల్ ప్రోడక్ట్స్‌పై గణనీయంగా వెచ్చించాయని తెలిపారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

