Moon Lighting | సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒక సంస్థలో పని చేస్తుండగా.. మరో కంపెనీకి సేవలు అందించడంపై ఐటీ రంగ సంస్థలు భగ్గుమంటున్నాయి. దీన్నే `మూన్ లైటింగ్` అని అంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో తమ ఉద్యోగుల్లో మూన్‌లైటింగ్ పాల్పడిన వారి పట్ల భగ్గుమంటున్నాయి. మూన్ లైటింగ్ పాల్పడంతోపాటు తమ ప్రత్యర్థులకు కార్పొరేట్ రహస్యాలను లీక్ చేసిన ఉద్యోగులపై కొరడా ఝుళిపించాయి. ఇంటికి సాగనంపాయి. మూన్ లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
కానీ ఐటీ సర్వీస్ ప్రొవైడర్ టెక్ మహీంద్రా మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ నెలలో మూన్ లైటింగ్ పాలసీని ప్రకటిస్తామని టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్రసోన్ చెప్పారు. అతి తక్కువ కాలం ఇతర సంస్థకు పని చేయడానికి అనుమతించాలని, అడ్డంకులు సృష్టించొద్దని టెక్ మహీంద్రా నిర్ణయించినట్లు సమాచారం. మార్కెటింగ్ హెడ్ కూడా అయినా హర్షవేంద్ర సోన్ స్పందిస్తూ.. వారంలో రెండు గంటలు, వారాంతంలో షార్ట్ పీరియడ్ వరకు ఇతర సంస్థలకు సేవలందించడానికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. సంస్థ పనితీరుకు ఆటంకం కలగనంత వరకు అనుమతించాలని టెక్ మహీంద్రా తెలిపింది.
తమ ఉద్యోగులు ఆఫీస్ వర్క్‌కు ఎటువంటి పోటీ పడకుండా మూన్ లైటింగ్‌కు పాల్పడేందుకు టెక్ మహీంద్రా వెల్లడించింది. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్, కస్టమర్ కాంట్రాక్టుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నది. మూన్ లైటింగ్‌కు పాల్పడేందుకు కంపెనీ నుంచి రాత పూర్వక అనుమతి పొందడం అవసరం తదితర సూత్రాలను ప్రతిపాదించనున్నదని హర్షవేంద్ర సోన్ తెలిపారు.
తొలుత మూన్ లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులకు తొలుత హెచ్చరికలు జారీ చేసిన ఇన్ఫోసిస్.. తన నిర్ణయం వివాదాస్పదం కావడంతో వెనక్కు తగ్గింది. మూన్ లైటింగ్ చేసేందుకు సంబంధిత ఉద్యోగి తమ ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధన తీసుకొచ్చింది. మూన్ లైటింగ్‌కు పాల్పడటం వల్ల అట్రిక్షన్ల (వలసలు) రేటు తగ్గుతుందని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి.