ఏప్రిల్ లో టాటా మోటార్స్ నుంచి అప్ డేటెడ్ వెహికల్..
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ముందంజలో ఉంది. ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన టాటా మోటార్స్ లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో ముందంజలో ఉంది. ఇప్పటికే టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెచ్చిన టాటా మోటార్స్ లాంగ్ రేంజ్ వేరియంట్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త టాటా నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ టెస్ట్ మోడల్లో 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, మొత్తం ఫోర్ వీల్స్ లో డిస్క్ బ్రేక్‌లు మాత్రమే ముఖ్యమైన మార్పులుగా కనిపిస్తున్నాయి. ఈ తరహా అల్లాయ్ వీల్స్ ని కంపెనీ ఇప్పటికే తమ పెట్రోల్ పవర్డ్ నెక్సాన్ కారు డార్క్ ఎడిషన్‌లో ఉపయోగిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇప్పుడు వెనుక టైర్లపై కూడా డిస్క్ బ్రేక్‌లను జోడించడం ద్వారా అదనపు ప్రయోజనం లభిస్తుంది.
ఈ కొత్త లాంగ్ రేంజ్ వేరియంట్ టాటా నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని సమాచారం. ఇది ఏప్రిల్ నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త 2022 టాటా నెక్సాన్ ఈవీలో పెద్ద 40 కే డబ్ల్యూ హెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఫలితంగా, ఇందులో ఎక్కువ రేంజ్ ను పొందటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చారు. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్పి పవర్‌ను, 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

