భూమివైపు దూసుకొస్తున్న భారీ సౌర తుఫాను.. జీపీఎస్, మొబైల్ సిగ్నల్స్‌కు డేంజర్

వాషింగ్టన్: ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోంది. దీని కారణంగా సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న ఓ భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించారు. ఇది భూవాతావరణంవైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఇది సూర్యుడి వైపు ఉన్న భూమిపై సబ్-సోలార్ పాయింట్లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడించింది. ఇది హైఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ల బ్లాకౌట్‌కు కారణం కావచ్చని అంచనా వేసింది. ఓ గంట పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ బ్లాకౌట్ జరిగే అవకాశం ఉన్నదని తాజాగా ఈ స్పేస్ వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ తెలిపింది. ఈ సౌర మంటలకు ఈ సెంటర్ ఎక్స్1 లెవల్‌గా గుర్తించింది.
గంటకు 16 లక్షల కి.మీ. వేగంతో..
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా కూడా ఈ సౌర తుఫాను గురించి చెప్పింది. ఇది భూమి వైపు గంటకు 16 లక్షల కి.మీ. వేగంతో దూసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ వేగం మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు కూడా నాసా అంచనా వేసింది. దీని కారణంగా భూమి ఎగువ వాతావరణంలోని శాటిలైట్లపై ప్రభావం పడనుంది. ఇది నేరుగా జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థ, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీలపై ప్రభావం చూపుతుంది. ఈ సౌర మంటల కారణంగా పవర్ గ్రిడ్లపైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

