Shortest day | రేపే షార్టెస్ట్ డే.. పగలు నిడివి 10 గంటల 40 నిమిషాలే..!
Shortest day | కొన్నిసార్లు త్వరగా చీకటి పడిపోయిందని అనుకుంటుంటాం. అచ్చం అలాంటి అనుభూతి రేపు నిజం కానున్నది. రేపు షార్టెస్ట్ డే. అంటే పగలు నిడివి చాలా తక్కువగా ఉంటుంది. త్వరగా చీకటి పడిపోయి దాదాపు 14 గంటలపాటు రాత్రి కొనసాగనున్నది.
Shortest day | ఇవాళ త్వరగా చీకటి పడిపోయిందే..! అని అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం. అది కేవలం వాతావరణంలో మార్పుల కారణంగా త్వరగా రాత్రి వచ్చినట్లుగా భ్రమపడుతుంటాం. వివిధ నగరాల్లో రోజు నిడివి కొన్ని నిమిషాలు ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంటాయి. అయితే, మీరు అనుకుంటున్నట్లుగా రేపు చాలా త్వరగా చీకటి పడబోతున్నది.
ఖగోళంలో మార్పులు కొన్నిసార్లు డిసెంబర్ 21 న వస్తుండగా.. ఇంకొన్నిసార్లు 22 వ తేదీన జరుగుతాయి. ఇంతకుముందు 2020 లో డిసెంబర్ 21 న షార్టెస్ట్ డే వచ్చింది. కాగా, ఈసారి డిసెంబర్ 22 వస్తున్నది. షార్టెస్ట్ డే అంటే తక్కువ పగలు ఉండి, రాత్రి సమయం ఎక్కువగా రోజు. సాధారణంగా పగటి సమయం 12 గంటలుగా ఉంటుంది. అయితే, ఈ షార్టెస్ట్ డే నాడు మాత్రం పగలు 10 గంటల 40 నిమిషాల నిడివి ఉండనున్నది.
ఉజ్జయిని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా ప్రకారం, ప్రతి ఏటా డిసెంబర్ 21 లేదా 22న సూర్యుడు మకర రాశిలో ఉంటాడు. అంటే దీని తర్వాత ఉత్తరార్ధగోళం వైపు కదులుతాడు. దీని కారణంగా భూమి ఉత్తర భాగంలోని దేశాలలో పగలు పొడవు క్రమంగా పెరగడంతో రాత్రి సమయం తగ్గడం మొదలవుతుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలోని దేశాలలో సూర్యకాంతి చాలా కాలం పాటు భూమిపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో దీనిని అతిపెద్ద రోజుగా పిలుస్తారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

