న్యూఢిల్లీ : హైక్వాలిటీ వీడియోలను రికార్డు చేసే ఫాస్టర్ స్టోరేజ్ వెర్షన్‌తో శాంసంగ్ గెలాక్సీ 23 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. శాంసంగ్ 2023 ఫ్లాగ్షిప్ సిరీస్ ఫిబ్రవరిలో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్లో లీకయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ 8కే రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేసే వెసులుబాటును కలిగిస్తుందని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ పేర్కొంది.
ఇది అల్ట్రా మోడల్‌కు పరిమితం కాగా, స్టాండర్డ్‌తో పాటు ప్రొ వేరియంట్ మోడల్స్ 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. హై రిజల్యూషన్ వీడియోలు మరింత స్పేస్‌ను వినియోగించుకునే క్రమంలో శాంసంగ్ అప్‌కమింగ్ ఎస్23 సిరీస్‌లో బెటర్ స్టోరేజ్ ఆప్షన్‌ను అందించనుందని ఆశిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. మెరుగైన రీడింగ్, రైటింగ్ స్పీడ్ కోసం న్యూ వెర్షన్ లేటెస్ట్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వెర్షన్‌ను ఆఫర్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ స్మూత్ పెర్ఫామెన్స్ అందించేందుకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.