Galaxy A08 : కొరియన్ బ్రాండ్ శాంసంగ్ నుంచి తాజాగా గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ ఏ08 అనే 4జీ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఏ07 ఫోన్‌కు ఇది అప్‌డేటెట్ వెర్షన్. 4జీబీ+64జీబీ అనే సింగిల్ వేరియెంట్లో లభ్యమవుతుంది. ఎంట్రీ లెవెల్లో 4జీ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి మాత్రమే ఇది సరిపోతుంది. ధర రూ.18,499.
ప్రారంభం ఆఫర్ కింద తక్కువ ధరలో లభ్యం కావొచ్చు. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ కలర్స్‌లో లభ్యం. 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ, ఓఎస్ అప్డేట్స్ ఇస్తుంది కంపెనీ. శాంసంంగ్ స్టోర్లతోపాటు వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.7 అంగుళాల హెచ్డీ+పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ హీలియో జీ99+ప్రాసెసర్, ఎక్స్‌పాండబుల్ మెమరీ అప్టు 2టీబీ, 50ఎంపీ మెయిన్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సర్, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ బేస్డ్ వన్ యూఐ ఓఎస్, ఐపీ64 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి.