Samsung : 2022 ద్వితీయార్ధం వరకూ వెంటాడనున్న చిప్ కొరత!

సియోల్ : ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత వెంటాడుతున్న నేపధ్యంలో వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకూ ఈ సమస్య కొనసాగుతుందని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అంచనా వేసింది. స్మార్ట్‌పోన్ విడిపరికరాల సరఫరాదారులతో శాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ టీఎం రోహ్ భేటీ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆయా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో శాంసంగ్ మొబైల్ చీఫ్ చిప్ కొరతపై చర్చించారు.
చిప్ కొరతను అధిగమించేందుకు శాంసంగ్ పలు చర్యలు చేపడుతోందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. చిప్ సరఫరాదారులతో వార్షిక కాంట్రాక్టుల కోసం ప్రయత్నలు ముమ్మరం చేసింది. గతంలో రెండు వారాలకు సరిపడా ఉన్న చిప్ సరఫరాల నిల్వలు ఇప్పుడు నాలుగు వారాలకు పెరిగాయి. ఇక చిప్ కొరతతో వచ్చే ఏడాది జనవరిలో లాంఛ్ కావాల్సిన గెలాక్సీ ఎస్22 సిరీస్‌ను ఫిబ్రవరికి వాయిదా వేసిన కంపెనీ చిప్ సరఫరాల మెరుగుదలపై దృష్టిసారించింది.
మరోవైపు చిప్ కొరత సమస్యను అధిగమిస్తున్నామని, వచ్చే ఏడాదిలో పరిస్ధితి మరింత మెరుగుపడుతుందని క్వాల్‌కాం సీఈఓ క్రిస్టియనో అమన్ పేర్కొన్నారు. ఇక పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు క్వాల్‌కాం నుంచి తగినన్ని ప్రాసెసర్లు సమీకరించలేకపోవడం ఆయా స్మార్ట్ఫోన్ల తయారీపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

