అంతరిక్షంలో మూవీ షూటింగ్ చేసి భూమిపై ల్యాండైన డైరెక్టర్, నటి.. వీడియో

మాస్కో: అంతరిక్షంలో తొలిసారి ఓ మూవీ షూటింగ్ చేసిన రష్యన్ డైరెక్టర్, నటి 12 రోజుల తర్వాత ఆదివారం భూమిపై సురక్షితంగా ల్యాండయ్యారు. భూకక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఈ మూవీ షూటింగ్ చేశారు. నటి యూలియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకో ఆదివారం ఉదయం ఖజకిస్తాన్‌లో భూమిపై ల్యాండయ్యారు. ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ ల్యాండింగ్ వీడియోను షేర్ చేసింది. వీళ్లతోపాటు కాస్మోనాట్ ఒలెగ్ నోవిట్స్కీ కూడా భూమిపై దిగారు. ఒలెగ్ ఆరు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. సూయజ్ ఎంఎస్-18 స్పేస్‌క్రాఫ్ట్ వీళ్లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఈ నెలలోనే ఈ నటి, డైరెక్టర్ రష్యాలోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. ద చాలెంజ్ అనే పేరుతో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కోసం వీళ్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు.
Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More… https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og
— International Space Station (@Space_Station) October 17, 2021
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

