రష్యా సొంత స్పేస్ స్టేషన్.. 2025లో లాంచ్

మాస్కో: అంతరిక్షంలో అగ్రరాజ్యం అమెరికా కంటే ముందు రష్యాదే ఏకఛత్రాధిపత్యం. అంతెందుకు ఈ మధ్య అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ఆస్ట్రోనాట్లను పంపే వరకు కూడా అందులో రష్యాదే పైచేయి. అలాంటి రష్యా ఇప్పుడు సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మిస్తోంది. 2025లో దీనిని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్‌కాస్మోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కొత్త స్పేస్‌స్టేషన్ తొలి మాడ్యూల్ పని మొదలైనట్లు ఆయన చెప్పారు. సొంతంగా స్పేస్ స్టేషన్ లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రష్యా వైదొలిగే అవకాశాలు ఉన్నాయి. ఐఎస్ఎస్ నుంచి తప్పుకొని సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలని చాలా కాలంగా రష్యా భావిస్తోంది. 2025లో మాడ్యూల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంచేలా రష్యాకు చెందిన ఎనర్జియా స్పేస్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నదని రోగోజిన్ చెప్పారు.
ఈ మేరకు మాడ్యూల్ పనిలో ఉన్న ఎనర్జియా సిబ్బంది వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను 1998లో లాంచ్ చేశారు. ఇందులో రష్యాతోపాటు అమెరికా, కెనడా, జపాన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు రష్యా సొంతంగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఐఎస్ఎస్ నుంచి వైదొలిగే ఆలోచన చేస్తున్నట్లు ఆ దేశ ఉప ప్రధాని యూరీ బొరిసోవ్ చెప్పారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాస్‌కాస్మోస్ తెలిపింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 1998 నుంచి మనుషులను తీసుకెళ్లే పని రష్యానే చేస్తోంది. గతేడాది తొలిసారి అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ విజయవంతంగా ఈ పని చేయడంతో రష్యా ఏకఛత్రాధిపత్యానికి గండిపడింది. అంతరిక్షంలోకి తొలిసారి మనిషిని (యూరి గగారిన్) పంపిన చరిత్ర ఉన్న రష్యా ఈ మధ్య కాలంలో స్పేస్ ప్రోగ్రామ్‌లో వెనుకబడిపోయింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

