డోర్ డెలివరీ చేసే రోబోలు

ఇప్పటివరకు డోర్ డెలివరీ అంటే మనుషులు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పనికి కూడా రోబోలను వాడేస్తున్నారు. సింగపూర్ కి చెందిన ఓ కంపెనీ ఇలాంటి రోబోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ట్రయల్ రన్ లో ఈ రోబోలు బిజీగా ఉన్నాయి.
వీటికి పేరుకూడా ఉందండోయ్. కామెల్లో అనగానే యస్ బాస్ అంటూ రెడీ అయిపోతాయి. ఇందులో 20కేజీల వరకు స్పేస్ ఉంటుంది. అందులో మీరు ఏమి ఆర్డర్ చేశారో వాటిని నింపుకొని క్షణాల్లో మీ ఇంటి తలుపు తడుతుంది కామెల్లో.
మీరు సరుకులు తీసుకోగానే రోబోలు వాటంతట అవే క్లీన్ అయిపోతాయి. అల్ట్రావైలెట్ లైట్ ద్వారా వైరస్ లను చంపేసి శుభ్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ రోబోలు ఒక్కొక్కటి రోజుకు నాలుగైదు డోర్ డెలివరీలు చేస్తున్నాయి. కంపెనీ 700 వరకు రోబోలను ఈ డోర్ డెలివరీకి వాడుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

