Realme Narzo Days Sale | రూ.28వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.15 వేలకే.. బంపరాఫర్ ప్రకటించిన రియల్మీ
Realme Narzo Days Sale | తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీకోసమే రియల్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. నార్జో డేస్ సేల్‌లో భాగంగా Narzo సిరీస్‌కు చెందిన పలు 5జీ మొబైళ్లపై భారీ తగ్గింపు ప్రకటించింది.
Realme Narzo Days Sale | తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మీకోసమే రియల్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. నార్జో డేస్ సేల్‌లో భాగంగా Narzo సిరీస్‌కు చెందిన పలు 5జీ మొబైళ్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ వేదికగా రియల్మీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. జూన్ 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
ఈ Narzo Days Saleలో భాగంగా నార్జో 80, నార్జో 90, నార్జో 100 సిరీస్ మొబైళ్లపై గణనీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. Realme Narzo 100 lite 5G మోడల్‌తో పాటు Realme Narzo Power 5G మోడల్‌పై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. ఇప్పటికే ప్రకటించిన డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ కార్డు ఆఫర్, క్యాష్‌బ్యాక్ సదుపాయాలతో మరింత ఆదా కూడా చేసుకునే అవకాశం ఉంది.
ఈ సేల్‌లో ప్రధాన ఆకర్షణగా రియల్మీ నార్జో 100 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఉంది. దీని అసలు ధర రూ.27,999 కాగా, ప్రస్తుతం ఆఫర్లో రూ.15,249కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.12,750 వరకు డిస్కౌంట్ అందుతోంది. అదనంగా అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అంటే రూ.15వేల లోపే ఈ మొబైల్‌ను పొందే అవకాశం ఉంది.
Realme Narzo 100 lite 5జీ మొబైల్లో 6.8 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఇందులో 144Hz రీఫ్రెష్‌రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ అనుభవం మరింత సాఫీగా ఉండనుందది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్లో 7000mAh భారీ బ్యాటరీని అందించారు. ఫొటోగ్రఫీ కోసం 13మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక 10,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వచ్చిన Narzo Power 5G స్మార్ట్‌ఫోన్‌పైనా రియల్మీ డిస్కౌంట్లు ప్రకటించింది. దీని అసలు ధర రూ.35,999 కాగా, దీని ధరను రూ.27,999కి తగ్గించింది.
అలాగే Narzo 90x 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.16 వేల వరకు తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ.33,999 కాగా, ప్రస్తుతం ఈ మొబైల్ రూ17,999కే లభిస్తోంది. ఇక నార్జో 80లైట్, నార్జో 80 ప్రో 5జీ మోడళ్లపైనా రియల్మీ ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫర్లో మొబైల్ కొనుగోలు చేసేముందు ఫోన్ స్పెసిఫికేషన్లు, ధరలు, ఆఫర్ల నిబంధనలు పరిశీలించుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

