24న ఆకాశంలో అద్భుత దృశ్యం..! చూడడం మిస్సైతే 2040 వరకు ఆగాల్సిందే..!
Rare Planet Alignment | ఈ నెలలో ఖగోళ ప్రియులను ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనున్నది. సౌరవ్యవస్థలోని ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 24న ఆవిష్కృతం కానున్నది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. అయితే, అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్‌ల ద్వారా చూడొచ్చని, తెల్లవారు జామున ఐదుగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి కనిపించనున్నాయి. ఈ అరుదైన దృశ్యం 18 సంవత్సరాల తర్వాత కనిపించనున్నది. ఇంతకు ముందు చివరి సారిగా 2004 డిసెంబర్లో కనిపించింది.
అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సారి బుధుడు, శనిగ్రహాల మధ్య దూరం చాలా తక్కువగా ఉండనున్నది. ఐదు గ్రహాలు సరళ రేఖలోకి రావడం చాలా అరుదని స్కై అండ్ టెలిస్కోప్ అబ్జర్వింగ్ ఎడిటర్ డయానా హన్నికెన్ తెలిపారు. ఈ గ్రహాలు చివరిసారిగా 2004లో కనిపించాయని, మళ్లీ 2040లోనే కనిపిస్తాయన్నారు. జూన్ మాసం గడిచేకొద్దీ బుధగ్రహాన్ని సులభంగా చూడొచ్చని, ఈ నెల 24న ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజున వీనస్, మార్స్ మధ్య చంద్రవంకను చూడొచ్చన్నారు. సూర్యోదయానికి అరగంట ముందు ఈ ఖగోళ అద్భుతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. తూర్పు వైపు హోరిజోన్లో ఈ దృశ్యాన్ని బైనాక్యులర్ సహాయంతో చూడొచ్చని వివరించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

