PUBG : New State : పబ్జీ కొత్త వర్షన్ వచ్చేసింది.. ఇండియాలో లాంచ్
పబ్జీ కొత్త వర్షన్ వచ్చేసింది.. ఇండియాలో లాంచ్ | పబ్జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే కదా. అయితే.. పబ్జీ… న్యూ
పబ్జీ గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే కదా. అయితే.. పబ్జీ… న్యూ స్టేట్(PUBG : New State) పేరుతో కొత్త వర్షన్‌ను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చింది. పబ్జీ గేమ్ లవర్స్ కోసం రూపొందిన గేమ్ ఇది. ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐపాడ్ఓఎస్లలో డెవలప్ చేశారు. ఇండియాతో పాటు.. మరో 200 దేశాల్లో పబ్జీ న్యూ స్టేట్ గేమ్‌ను లాంచ్ చేశారు.

పబ్జీ నుంచి వచ్చిన కొత్త గేమ్ ఇది. దీన్ని గత ఫిబ్రవరిలోనే ప్రకటించి తాజాగా లాంచ్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ గేమ్‌లో ప్లేయర్స్ పొందొచ్చని పబ్జీ ప్రకటించింది. ఇందులో 100 మంది ప్లేయర్లు.. రకరకాల వెపన్స్, స్ట్రాటజీలను ఉపయోగించి గేమ్ ఆడొచ్చు.
ఈ గేమ్‌ను పబ్జీ స్టూడియోస్ డెవలప్ చేసింది. ఆండ్రాయిడ్ 6.0, ఐఓఎస్ 13, ఐపాడ్ఓఎస్ 13 నుంచి లేటెస్ట్ వర్షన్ వరకు ఈగేమ్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 17 భాషల్లో ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఇండియాలో బీజీఎంఐ అనే గేమ్‌ను క్రాఫ్టన్ సంస్థ లాంచ్ చేసింది. పబ్జీ బ్యాన్ తర్వాత వచ్చిన పబ్జీ తరహా గేమ్ అది. ఈ గేమ్ కంటే కూడా అత్యాధునికమైన వెపన్స్, ఫీచర్లతో ఇప్పుడు పబ్జీ.. న్యూ స్టేట్ గేమ్ లాంచ్ అయింది.
ఇవి కూడా చదవండి..
OnePlus : పేలిన వన్‌ప్లస్ నోర్డ్2 5జీ ఫోన్.. కస్టమర్‌కు నష్టపరిహారం అందించిన కంపెనీ
Youtube : యూట్యూబ్‌లో ఇక ఆ ఫీచర్ కనిపించదు
చరిత్రలో ఈరోజు : 38 ఏండ్ల క్రితం ప్రారంభమైన మైక్రోసాఫ్ట్ విండోస్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

