PSLV C-53 ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ.. రేపు రాకెట్‌ను నింగిలోకి పంపనున్న ఇస్రో
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లో రాకెట్‌ను గురువారం నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు PSLV C-53 మిషన్ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నది. సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం మేరకు ఇస్రో PSLV C-53 మిషన్ చేపడుతున్నది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి సాయంత్రం 6 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఈ క్రమంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 25 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం.. 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
మూడు గ్రహాలు నింగిలోకి..
పీఎస్ఎల్వీ సీ-53 వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనున్నది. ఒకటి డీఎస్-ఈఓ (DS-EO). దీని బరువు 365 కిలోలు. మరో ఉపగ్రహం సింగపూర్‌కు చెందిన న్యూసార్ ‘NeuSAR). దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. మూడో ఉపగ్రహం స్కూబ్-I (SCOOB-I). నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు కేవలం 2.8 కిలోలే. DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగపూర్‌కు చెందిన న్యూసార్ ఉపగ్రహం సార్ పేలోడ్‌ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో చిత్రాలను అందించనున్నది. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I). సింగపూర్‌లోని ఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు రూపొందించారు.
పీఎస్ఎల్వీ 55వ మిషన్..
పీఎస్ఎల్వీ 55వ మిషన్ ఇది. పీఎస్ఎల్వీ-కోర్ అలోన్ వేరియంట్‌ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్‌గా ఇస్రో అధికారులు తెలిపారు. ఇంకా షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ప్రయోగం నాలుగు దశల్లో జరుగనున్నది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నది. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

